భారతదేశం, జూలై 18 -- Jani Master: టాప్ హీరోలతో సాంగ్స్.. కుర్రాళ్లను ఉర్రూతలూగించేలా స్టెప్పులు.. డ్యాన్స్ మూమెంట్స్ తో మైమరిపించే టాలెంట్.. ఇదీ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టోరీ. కానీ ఇది కాయిన్ కు ఒక వైపు మాత్రమే. మరోవైపు వరుస వివాదాలున్నాయి. తీవ్రమైన కేసులు ఉన్నాయి.

తాజాగా డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) జానీ మాస్టర్, ఆయన భార్య సుమలతపై నాన్-కోఆపరేషన్ పిలుపునిచ్చింది. సుమలత ప్రస్తుత తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఫెడరేషన్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, యూనియన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే జానీ మాస్టర్ పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనివల్ల రాబోయే రోజుల్లో జాని మాస్టర్ కంపోజ్ చేసే పాటలకు ఫెడరేష...