భారతదేశం, మే 23 -- Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అటు యాక్టింగ్ లో, ఇటు అందంలోనూ దివంగత తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా జాన్వీ సాగిపోతోంది. తాజాగా 'పెద్ది కి ఆవాజ్' ఈవెంట్లో జాన్వీ కపూర్ మెరిసిపోయింది. ఆమె ఫొటోలు, వైరల్ తెగ వైరల్ గా మారాయి.

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లను పరుగెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (మే 23) మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 'పెద్ది కి ఆవాజ్' పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో జాన్వీ కపూర్ పార్టిసిపేట్ చేసింది.

పెద్ది కి ఆవాజ్ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆమె ఎంట్రీ టైమ్ లో ఫ్యాన్స్ కేకలు పెట్టారు. ఈ స్పెషల్ ప్లేస్ లో పెద్ది ఈవెంట్ జరగడం హ్యాపీగా ఉందని జాన్...