భారతదేశం, మే 24 -- Jana Nayagan: తమిళ సూపర్ స్టార్, సీఎం సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కొద్దిరోజుల క్రితమే విజయ్ కుటుంబ సభ్యులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన వెండితెరపై కనిపించబోయే చివరి సినిమా 'జన నాయగన్' రిలీజ్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.

దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ మూవీ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ వైరల్ గా మారింది. ఈ మూవీ జూన్ 19న రిలీజ్ కానుందని సమాచారం. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ సెన్సార్ వివాదాల కారణంగా థియేటర్లలోకి రాలేకపోయింది. జనవరిలోనే సినిమా విడుదల కావాల్సింది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) రివైజ...