భారతదేశం, అక్టోబర్ 14 -- Jailer 2 Advance Bookings Record: తలైవర్ ఈజ్ బ్యాక్! రజినీకాంత్ తన కెరీర్‌లోనే అత్యంత అరుదుగా చేస్తున్న సీక్వెల్ మూవీ 'జైలర్ 2' (Jailer 2) తో థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఈ గురువారం (అక్టోబర్ 15) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో తలైవర్ తుఫాన్ రాబోతోందని స్పష్టమవుతోంది.

ఇండియాలో అక్టోబర్ 10న 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, అంతకు ఒక రోజు ముందే ఓవర్సీస్‌లో టికెట్ల అమ్మకాలు షురూ అయ్యాయి. టికెట్ విండోస్ వద్ద ఈ సినిమా బుకింగ్స్ రన్నింగ్ స్టార్ట్ అందుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 14) ఉదయానికి ఈ సినిమా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప...