భారతదేశం, జూన్ 2 -- Jagapathi Babu: టాలీవుడ్‌లో గతేడాది వచ్చిన అతిపెద్ద సక్సెస్ స్టోరీస్‌లో 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) సినిమా ఒకటి. యూత్ స్టార్స్ మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగరామ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాతో.. సీనియర్ మేకర్ బి.వి.ప్రసాద్ మనవడు సాయి మార్తాండ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకున్న ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌పై తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు కొన్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా తన 'పెద్ది' (Peddi) మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జగపతి బాబు.. 'లిటిల్ హార్ట్స్' సినిమా గురించి మాట్లాడుతూ దాన్ని ఒక "నాన్‌సెన్స్ సినిమా" అని అభివర్ణించారు. అయితే ఆయన ఈ మాటను నెగెటివ్‌గా అనలేదు. మన కమర్షియల్ సినిమాల రెగ్యులర్ ఫార్ములాలకు భిన్నంగా ఆ సినిమా సాగిందనే అర్థంలో సరదాగా వాడ...