భారతదేశం, జూన్ 8 -- Jagapathi Babu: రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో పెద్ది పబ్లిక్ టాక్ మాత్రం హీరోయిన్ జాన్వీ కపూర్‌కు కొంత ప్రతికూలంగా ఉంది.

పెద్ది సినిమాలో ఆమె నటన, క్యారెక్టరైజేషన్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. పెద్ది హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే, ఒక నటిని ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ట్రోలింగ్‌పై సినిమాలో 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. జాన్వీ కపూర్‌ను ఎవరూ ట్రోల్ చేయొద్దని ఆయన ...