భారతదేశం, ఆగస్టు 30 -- ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్​) ఫైల్ చేసిన తర్వాత చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా, చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ కట్టినప్పుడు ఈ రీఫండ్ కోసం ఆసక్తిగా ఉంటారు. అయితే ఐటీఆర్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది? అనేది చాలామందికి ఉన్న పెద్ద ప్రశ్న. ఇంతకీ రీఫండ్​ రావడానికి ఎంత సమయం పడుతుంది?

ఐటీఆర్ ఫైలింగ్ సహా దానిని ఈ-వెరిఫై చేసిన తర్వాత, ఆదాయపు పన్ను శాఖ మీ రీఫండ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి 7 నుంచి 21 పనిదినాల సమయం తీసుకుంటుంది. "సాధారణంగా, రీఫండ్ పన్ను చెల్లింపుదారుడి ఖాతాలో జమ కావడానికి 4-5 వారాలు పడుతుంది," అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పన్ను చెల్లింపుదారుడు తన రిటర్న్‌ను ఈ-వెరిఫై చేసిన తర్వాత మాత్రమే రీఫండ్ ప్రాసెసింగ్ మొదలవుతుంది. మీ బ్యాంక్ ఖ...