భారతదేశం, అక్టోబర్ 13 -- దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ట్రేడింగ్​లో ఐటీ రంగానికి చెందిన షేర్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి! దేశంలో ప్రముఖ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు ఓపెనింగ్​లో ఏకంగా 5 శాతం వరకు ఎగబాకాయి. దీనితో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతం మేర పుంజుకుని మార్కెట్లను ముందుండి నడిపించింది.

ఉదయం 10:30 గంటల సమయంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.3శాతం మేర లాభాలతో దూసుకెళుతోంది. అదే సమయానికి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 50 కూడా 0.78 శాతం లాభపడి 22,537 పాయింట్ల వద్ద ట్రేడయింది.

ఐటీ రంగంలో ఈ అకస్మాత్తు ర్యాలీకి అనేక అనుకూల అంశాలు కలసివచ్చాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ ప్రకటించిన రెండో త్రైమాసిక (క్యూ2ఎఫ్​వై27) బలమైన ఆర్థిక ఫలితాలు, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, ఆసియా మార...