భారతదేశం, మార్చి 9 -- టీమిండియా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం (మార్చి 8) రాత్రి ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది. ఈ విజయంతో దేశమంతా సంబరాలు నెలకొన్నాయి. ఈ సమయంలోనే ఓ అమ్మాయి పేరు తెగ వైరల్ గా మారింది. అదితి హుండియా ఎవరు? ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ప్లేయర్లు మైదానంలోనే డ్యాన్స్ చేశారు. సంతోషం పట్టలేక స్టెప్పులేశారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య డ్యాన్స్ కూడా వైరల్ గా మారింది. అయితే హార్దిక్ తో కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ఓ అమ్మాయిని పట్టుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

ఇషాన్ కిషన్ ముద్దు పెట్టిన అమ్మాయ...