భారతదేశం, మార్చి 20 -- ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సెలవుల విషయంలో బ్యాంక్ కస్టమర్లలో కొంత గందరగోళం నెలకొంది. చంద్రదర్శనం (చాంద్ రాత్)పై ఆధారపడి ఈ సెలవు మారుతూ ఉండటమే ఇందుకు కారణం. అయితే, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 20, 21 తేదీల్లో రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలను వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మార్కజీ చాంద్ కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం.. గురువారం నాడు నెలవంక కనిపించలేదు. దీనివల్ల శుక్రవారం (మార్చి 20) రంజాన్ మాసంలో 30వ రోజు అవుతుంది. పండుగను శనివారం, మార్చి 21న జరుపుకోనున్నారు.

చాలా రాష్ట్రాల్లో శనివారం సెలవు ఉన్నప్పటికీ, ఈ కింది ప్రాంతాల్లో మాత్రం శుక్రవారమే (మార్చి 20) బ్యాంకులు మూసి ఉంటాయి:

ఆంధ్రప్రదేశ్

శ్రీనగర్

ఆర్బీఐ జాబితా ...