భారతదేశం, ఆగస్టు 18 -- Irumudi Ram charan: హిట్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరో ఇప్పుడు 'ఇరుముడి' అంటూ థియేటర్లకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ దూకుడు చూపిస్తోంది.

రీసెంట్ గా ఇరుముడి సినిమా నుంచి 'మల్లెపూల పల్లకి' అనే పాపులర్ అయ్యప్ప భక్తి పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ట్రెండింగ్ లో దూసుకొచ్చింది. అయితే ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రత్యేక క్యామియో ఉందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించిన 'మల్లెపూల పల్లకి' సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట ప్రమోషనల్ కంటెంట్‌లో ఉన్న ప్రత్యేకమైన ఎలిమెంట్స్ చూసి నెటిజన్లు రామ్ చరణ్ ఇందులో ...