భారతదేశం, సెప్టెంబర్ 18 -- Irumudi OTT: ఒక సినిమా.. కుటుంబాలను కదిలించింది. ఒక సినిమా.. షోలు వేయాలని ధర్నాలు చేసేలా చేసింది. ఒక సినిమా.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ అలరించింది. అదే.. ఇరుముడి సినిమా. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 18) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి మూవీ అంచనాలను మించి అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ జనాలకు తెగ నచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో సహా అయిదు భాషల్లో రిలీజైంది.

ఇరుముడి మూవీని ఓటీటీలో ఎందుకు చూడాలంటే.. ముందుగా తండ్రీకూతురు ఎమోషన్ గురించి చెప్పుకోవాలి. ఇందులో రవితేజ, అతని కూతురిగా నటించిన బేబీ నక్షత్ర మధ్య బాండింగ్ వేరే లె...