IRCTC New Website : రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్! అతి త్వరలో ఐఆర్సీటీసీ సరికొత్త వెబ్సైట్
భారతదేశం, జూన్ 12 -- New IRCTC website launch date : దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ఉపయోగించే ఐఆర్సీటీసీ వెబ్సైట్లోని లోపాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాంకేతిక హంగులతో మరింత వేగంగా పనిచేసే సరికొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ను ఈ ఏడాది జులై 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ కీలక ప్రకటన చేశారు. జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ)లో విద్యార్థులతో జరిగిన ఒక ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. వేదికపై నుంచే లైవ్లో నేరుగా రైల్వే ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.