భారతదేశం, మార్చి 26 -- క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదంలో మునిగిపోయేందుకు సిద్ధమైపోండి. ఐపీఎల్ 2026 వచ్చేస్తోంది. మార్చి 28నే ఐపీఎల్ కొత్త సీజన్ కు తెరలేవనుంది. మరో రెండు రోజుల్లోనే ఐపీఎల్ 19 ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఆడే ఫస్ట్ హోం గేమ్ టికెట్లు ఇవాళే సేల్ కు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ తన హోం గ్రౌండ్ లో ఆడే ఫస్ట్ మ్యాచ్ టికెట్ సేల్స్ ఈ రోజు (మార్చి 26) స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ తలపడనుంది.

ఉప్పల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏప్రిల్ 5న మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టికెట...