భారతదేశం, మార్చి 11 -- క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. బీసీసీఐ బుధవారం (మార్చి 11) ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొలి 16 రోజుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే పోరుతో టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది.

ఈసారి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్‌లకు అత్యంత కీలకం కానుంది. కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ మైదానంలోకి దిగుతుండగా, కమిన్స్ గత డిసెంబర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతున్నారు. మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో గువహటిలో ఆడనుంది. ఈసారి...