భారతదేశం, ఆగస్టు 25 -- దిగ్గజ యాపిల్ సంస్థ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 18 ప్రో, కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా వస్తున్న ఫోల్డెబుల్ ఐఫోన్‌లను సెప్టెంబర్ 9న లాంచ్ చేయనున్నట్లు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ నివేదించింది. అయితే దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయని నిపుణులు పేర్కొన్నారు.

యాపిల్ తన సెప్టెంబర్ ఈవెంట్‌కు సుమారు రెండు వారాల ముందు తేదీని ప్రకటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25 లేదా 26 తేదీలలో లాంచ్ ఈవెంట్ తేదీని వెల్లడించే అవకాశం ఉందని ఫోర్బ్స్ తెలిపింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

యాపిల్ సాధారణంగా లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత వచ్చే శ...