భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఐఫోన్​ యూజర్స్​కి అలర్ట్​! యాపిల్​ సంస్థ నుంచి కొత్త ఆపరేటింగ్​ సిస్టమ్​ ఐఓఎస్​ 26 (iOS 26) అధికారికంగా లాంచ్​ అయ్యింది. యాపిల్ ఇంటెలిజెన్స్ అనే ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫామ్, రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్, సరికొత్త డిజైన్​తో యాప్‌లు, మెరుగైన ప్రైవసీ టూల్స్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఈ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అయితే ప్రతి పెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లాగానే, ఈసారి కూడా కొన్ని పరికరాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసింది యాపిల్​. ముఖ్యంగా ఏఐ ఫీచర్లను నిర్వహించగల సామర్థ్యం ఉన్న కొత్త ఐఫోన్లకు మాత్రమే ఐఓఎస్ 26 అందుబాటులో ఉంటుంది! దీనితో లక్షలాది మంది పాత ఐఫోన్ యూజర్లు ఈ అప్డేట్​కు దూరమయ్యారు.

ఐఓఎస్ 26 అర్హత గల పరికరాల జాబితాను యాపిల్ చాలా ఎక్స్​క్లూజివ్​గా ఉంచింది. ఈ అప్డేట్ ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లకు, ఐఫోన్ ఎ...