భారతదేశం, ఫిబ్రవరి 10 -- స్మాప్చాట్కి గట్టి పోటీని ఇచ్చే విధంగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్‌ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దాని పేరు "ఇన్స్టంట్స్". వినియోగదారులు పంపిన ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే మాయమైపోయేలా (డిసప్పియర్) ఈ ఇన్‌స్టాంట్స్ యాప్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం..
ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. మెటా ప్రస్తుతం ఈ ఇన్స్టంట్స్ యాప్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్పై పనిచేస్తోంది. ఫోటోలు పంపిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమయ్యేలా దీనిని రూపొందిస్తున్నారు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం అంతర్గతంగా అభివృద్ధి దశలోనే ఉందని, ఇంకా ఎక్స్టర్నల్ టెస్టింగ్ కోసం అందుబాటులోకి రాలేదని మెటా ప్రతినిధి స్పష్టం చేశారు.
దీని బట్టి చూస్తే, ఈ యాప్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అర్థం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.