భారతదేశం, ఫిబ్రవరి 27 -- సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల రక్షణ కోసం మరో కీలక ముందడుగు వేసింది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులకు సహాయపడేలా కొత్త 'పేరెంటల్ నోటిఫికేషన్' ఫీచర్‌ను తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా ఆత్మహత్యలు లేదా తమను తాము గాయపరచుకునేలా (సెల్ఫ్​- హార్మ్​) ప్రేరేపించే కంటెంట్ కోసం టీనేజర్లు వెతుకుతున్నప్పుడు, ఈ ఫీచర్ ఒక హెచ్చరికలా పనిచేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'పేరెంటల్ సూపర్‌విజన్' టూల్స్‌ను ఎనేబుల్ చేసుకున్న తల్లిదండ్రులకు మాత్రమే ఈ అలర్ట్‌లు అందుతాయి. ఆత్మహత్య లేదా స్వయం హింసకు సంబంధించిన పదాలను ఒక టీనేజర్ తక్కువ వ్యవధిలో పదే పదే సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ విషయాన్ని మెటా గుర్తిస్తుంది. వెంటనే తల్లిదండ్రులకు ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ లేదా ఇన్-యాప్ నోటిఫికేషన్ ద్వారా...