భారతదేశం, జూన్ 26 -- టీ20 ప్రపంచకప్ 2026ని కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు భవిష్యత్తు లక్ష్యాల వైపు అడుగులు వేస్తోంది. 2028లో జరగబోయే తదుపరి టీ20 వరల్డ్ కప్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు బలమైన జట్టును సిద్ధం చేసే పనిని బీసీసీఐ ఇప్పుడే ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. ఐర్లాండ్​తో 2 మ్యాచుల టీ20 సిరీస్​ నేడు ప్రారంభంకానుంది. బెల్​ఫాస్ట్​లోని సివిల్ సర్వీస్ క్రికెట్​ క్లబ్ వేదికగా.. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తొలి టీ20 మ్యాచ్​ జరగనుంది. కాగా అందరి ఫోకస్​ యంగ్​ గన్ వైభవ్​ సూర్యవంశీపైనే ఉంది. కానీ అతని అరంగేట్రంపై సస్పెన్స్ నెలకొంది.

ఈ పర్యటన కోసం భారత్ దాదాపు పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టును ఎంపిక చేసింది. ప్రపంచకప్ నెగ్గిన జట్టు నుంచి అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర...