భారతదేశం, ఆగస్టు 14 -- భారతదేశం.. ప్రతి ఏటా ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. 2026 సంవత్సరంలో ఈ వేడుక శనివారం రోజున వచ్చింది. రెండొందల ఏళ్ల బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన వైనాన్ని, స్వేచ్ఛా దేశ స్వప్నాన్ని సాకరం చేయడానికి ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను ఈ రోజు స్మరించుకుంటాము.

ప్రతి ఏటా లాగే 2026లో ఇది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా అనేదానిపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. దీనిపై స్పష్టత ఏమిటంటే, 2026లో భారత్ తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలకుల చెర నుంచి స్వాతంత్ర్యం సాధించింది.

ప్రస్తుత సంవత్సరం 2026 నుంచి 1947ని తీసివేయడం వల్ల 79 వస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే మొదటి స్వాతంత్ర్య వేడుకను లెక్కలోకి తీసుకోకపోవడం వల్లే ఈ పొర...