భారతదేశం, ఫిబ్రవరి 16 -- టీ20 ప్రపంచకప్ లో భారత్ చెలరేగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి ముగిసిన ఈ మ్యాచ్ తో ఇండియాలో సంబరాలు మిన్నంటాయి. కానీ మ్యాచ్ కంప్లీట్ కాగానే అక్కడే గ్రౌండ్ లో భారత ఆటగాళ్ల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. మన ప్లేయర్ల మధ్య చిన్న గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్య తన బౌలింగ్ లో ఉస్మాన్ తారిఖ్ ను బౌల్డ్ చేసి పాకిస్థాన్ ఇన్నింగ్స్ కు ఎండ్ కార్డు వేశాడు. ఆ తర్వాత ఇండియన్ ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ తో హార్దిక్ పాండ్య చిన్నగా గొడవ పడ్టట్లు తెలిసింది. వీళ్ల దగ్గరకు వెళ్లిన తిలక్ వర్మ ఆందోళనతో కనిపించాడు. రింకు సింగ్ వెంటనే జోక్యం చేసుకుని ఆటగాళ్లను కూల్ చేసేందు...