భారతదేశం, మార్చి 3 -- టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో కఠిన సవాలుకు సిద్ధమవుతోంది. సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఢీ కొట్టబోతుంది. మార్చి 5న వాంఖడేలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఈ సెమీస్ నేపథ్యంలో ఇండియా ఆల్ రౌండర్ విల్ జాక్స్ తో జాగ్రత్త అంటూ టీమిండియాకు సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ ముందు ఇండియాకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ తో జాగ్రత్త అని గవాస్కర్ సూచించాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో విల్ జాక్స్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఏడు మ్యాచ్‌లలో ఏడు వికెట్లతో పాటు, ఒక హాఫ్ సెంచరీతో సహా 191 పరుగులు చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక, ఇటలీ, నేపాల్ పై 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

సూపర్ 8లో వెస్టిండీస్ పై అద్...