IMD rain alert : ఐఎండీ అలర్ట్.. దక్షిణాది రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు!
భారతదేశం, నవంబర్ 6 -- తెలుగు రాష్ట్రాలను వణికించిన 'మురసు' తీవ్ర తుపాను ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తూర్పు తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర సమీపంలో గురువారం నాటికి ఈ తుపాను తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. అయితే తుపాను గండం ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోపే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 11వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
గత రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు ఎన్టీఆర్, కృష్ణా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. విజయవాడ, నందిగామ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంట నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు మళ్లీ వారం రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.