భారతదేశం, ఆగస్టు 3 -- నైరుతి రుతుపవనాలు జోరందుకున్న వేళ రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈశాన్య భారతం సహా మధ్య, తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వర్షాల తీవ్రత గణనీయంగా పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో దక్షిణాదిలో వర్షాల ప్రభావం తగ్గినా.. కర్ణాటక తీర ప్రాంతాలు, దక్షిణ లోతట్టు జిల్లాలు, కేరళలో మాత్రం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది.

ఈశాన్య భారత్: ఆగస్టు 5న అరుణాచల్ ప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 3 నుంచి 5 మధ్య అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఆగస్టు 3 నుంచి 8 వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఉత్తర భారత్: జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో ఆగస్టు 3...