భారతదేశం, సెప్టెంబర్ 24 -- బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న తీవ్ర వాయుగుండం ఉగ్రరూపం దాల్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నానికి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో రాబోయే 24 నుంచి 48 గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

తీవ్ర వాయుగుండం భయానక ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, క...