భారతదేశం, ఏప్రిల్ 12 -- Today weather : రానున్న రోజుల్లో ఎండల తీవ్రతపై భారీ హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయి. ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉండగా, తూర్పు, మధ్య భారతదేశంలో ఈ వారం 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 13 తర్వాత ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయంటూ హీట్​వేవ్​ హెచ్చరికలను జారీ చేసింది.

1. ఈశాన్య, తూర్పు భారతదేశం:

వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో హిమాలయ పశ్చిమ ప్రాంతాల్లో ఏప్రిల్ 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 30-50 కిలోమీట...