భారతదేశం, జూన్ 1 -- IMAX in Hyderabad Returns: హైదరాబాద్ సినీ ప్రియుల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడనుంది. భాగ్యనగరంలో మళ్లీ ఐమాక్స్ (IMAX) స్క్రీన్ హంగామా షురూ కాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ కొద్దిరోజుల క్రితం ఇచ్చిన హింట్ నిజమైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నేతృత్వంలోని 'ఏఎంబీ సినిమాస్' భాగస్వామ్యంతో సరికొత్త లేజర్ ఐమాక్స్ థియేటర్ మన ముందుకు వస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రసిద్ధ ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్ (AMB Classic Sudarshan) వేదికగా ఈ అద్భుత థియేటర్ ఆవిష్కృతం కానుంది.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం.. ఐమాక్స్ కార్పొరేషన్, ఏషియన్ సినిమాస్ సంస్థలు భారత్‌లో మూడు సరికొత్త 'ఐమాక్స్ విత్ లేజర్' (IMAX with Laser) స్క్రీన్లను ఏర్పాటు చేయడానికి అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏఎంబీ సినిమాస్ బ్రాండ...