భారతదేశం, మే 29 -- IMAX: సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా హైదరాబాద్ మూవీ లవర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. భాష, నటీనటులతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ బాగుంటే చాలు థియేటర్లకు బ్రహ్మరథం పడతారు. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఒక్క ఐమాక్స్ (IMAX) స్క్రీన్ కూడా లేకపోవడం ఇక్కడి సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

ఒకప్పుడు ప్రసాద్స్ థియేటర్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని తొలగించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సినీ ప్రేమికుల ముఖాల్లో తక్షణమే నవ్వులు పూయించే ఒక సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. నగరంలో సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ (Asian Suniel Narang) స్పష్టం చేశారు.

ఇటీవల Gulte వెబ్‌సైట్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ నారంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ధృ...