భారతదేశం, సెప్టెంబర్ 23 -- Illu Illalu Pillalu September 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మీ అమ్మ అద్భుతమైన ఐడియా వేసిందంటా అని ధీరజ్ ను నర్మద తీసుకెళ్తుంది. వాళ్ల ఇంటి వైపు ఎందుకు తొంగి చూస్తున్నావని వేదవతిని ధీరజ్ అడుగుతాడు. దొంగ కోళ్లు పట్టడానికేమోనని నర్మద కౌంటర్ వేస్తుంది.

కారు తీసి రెడీ పెట్టు. నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేద్దాం. దానితో మాట్లాడదామంటే కొత్త పెళ్లి కూతురిలా అది బయటకు రావడం లేదని వేదవతి ప్లాన్ చేస్తుంది. మీరు కానివ్వండి ఫైర్ వతి గారు అని నర్మద మళ్లీ కౌంటర్ వేస్తుంది. కిడ్నాప్ వద్దు అమ్మ, నేను ఒప్పిస్తానని ధీరజ్ అంటాడు. మీరు మాట్లాడుకుంటే శాంతి చర్చలు కాదు, రక్తపాతాలు జరుగుతాయని వేదవతి అంటుంది.

అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. ప్రేమ వెనుకాల బాడీగార్డులా ఇద్దరు మనుషులు వస్తారు. ప్రేమ ఆటలో వెళ్తుంట...