భారతదేశం, సెప్టెంబర్ 14 -- Illu Illalu Pillalu September 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తిరుపతి, సుకన్యకు పెళ్లి చేసిన ధీరజ్, ప్రేమ వాళ్లిద్దరినీ ఇంటికి తీసుకొస్తారు. అది చూసి వేదవతి ఫైర్ అవుతుంది. అప్పుడే శ్రీవల్లి మరో డ్రామా స్టార్ట్ చేస్తుంది.

నీకు అసలు బుద్ధిందా అని సుకన్యను బల్లక్కాయ్ కొడుతుంది. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా? ఇంత మోసం చేస్తావా? అని వల్లి చేయి లేపుతుంది. అప్పుడే భద్రావతి అండ్ కో ఆవేశంతో ఊగిపోతూ దిగుతారు. కొట్టాల్సింది ధీరజ్ ను. వీడిని నరికేయాలని భద్రావతి అంటుంది.

భద్రావతి నోరు అదుపులో పెట్టుకో. వీళ్లు వెళ్లి పెళ్లి చేసుకుంటే నా కొడుకును అంటున్నావేంటీ? అని వేదవతి ఫైర్ అవుతుంది. ఈ పెళ్లి చేసిందే వీడు. నీ కొడుకే వీళ్లను తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేశాడని భద్రావతి చెప్పేస...