భారతదేశం, సెప్టెంబర్ 10 -- Illu Illalu Pillalu September 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో ఎంగేజ్మెంట్ అని తిరుపతిని సేనాపతి బలవంతంగా తీసుకెళ్తాడు. బాబాయికి గుడిలో సడెన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశార్రా అని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది.

మరోవైపు రామరాజు కూడా రైస్ మిల్ కు వస్తానని చందుతో అంటాడు. రైస్ మిల్ లో డబ్బులు పోతుంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తాడు. అప్పుడే అమ్మా అంటూ అరుస్తూ ధీరజ్ లోపలికి వెళ్తాడు. కానీ వేదవతి ఉండదు. ఏమైందని రామరాజు అడిగితే.. తిరుపతి మామాకు గుడిలో ఎంగేజ్మెంట్ అంటా అని ధీరజ్ చెప్తాడు.

దీనికేనా ఇంత కంగారు పడుతున్నావ్. భద్రావతి కోపంతో చేసినా కూడా తిరుపతికి పెళ్లి అయి మంచి జీవితం ఏర్పడుతుంది. నేను కూడా వాడికి పెళ్లి చేయాలనుకున్నా. కానీ రెండు కుటుంబాలు కలిసిన తర్వాతే చేస...