భారతదేశం, అక్టోబర్ 28 -- Illu Illalu Pillalu October 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. దారిన పోతున్న వల్లిని పిలిచి మరీ భద్రావతి సెటైర్లు వేస్తుంది. సాధుజీవిలా మారిపోయావంటా. నిన్ను అడ్డుపెట్టుకొని రామరాజును జైల్లో ఉండేలా చేద్దామనుకున్నా. కానీ నా ప్లాన్ అంతా కంపు కంపు చేశావని భద్రావతి అంటుంది.

నువ్వేం బాధపడకు. నేను ఏదో ఒకటి చేసి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తానని భద్రావతి చెప్తుంది. వల్లికి ఆఫర్ ఇస్తుంది. అమ్మా తల్లి, ఇప్పటివరకూ చేసింది చాలు. మా అమ్మ మాటలు, నీ మాటలు విని నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇక మీదట మీ మాట వినను. నా జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటా. పాతికేళ్లుగా మీరు మీ తోడబుట్టిన చెల్లెలు కుటుంబాన్ని బాధపెడుతూనే ఉన్నారని బల్లక్కాయ్ అంటుంది.

మా మామ రామరాజు ఆయన భార్యను, మీ మేనకోడలు ప్రేమను ఎంతో ప...