భారతదేశం, అక్టోబర్ 19 -- Illu Illalu Pillalu October 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మా అమ్మడిని యువరాణిలా అత్తారింటికి తీసుకుపోతే కేసు వాపసు తీసుకుంటామని ఎస్ఐకి భాగ్యం చెప్తుంది. ఇంతకుముందైతే అయ్యో పాపం అని జాలి పడి ఉండేదాన్ని. కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పరువు తీశాక ఆలోచించేదే లేదని వేదవతి సీరియస్ అవుతుంది.

అయితే కోర్టులోనే తేల్చుకుంటామని భాగ్యం. అవును కోర్టులోనేె తేల్చుకుందామని ధీరజ్ అంటాడు. మీ మోసాల ఎవిడెన్స్ అన్నీ జడ్జీ ముందు పెట్టి అక్కడే తేల్చుకుందామని ధీరజ్ కౌంటర్ ఇస్తాడు. పోనీ అని ఒక ఛాన్స్ ఇచ్చాం. కానీ బుద్ధి చెప్పక తప్పదని అర్థమైందని సాగర్ కూడా అంటాడు.

అప్పుడే అక్కర్లేదని బయటి నుంచి శ్రీవల్లి వస్తుంది. కోర్టులకు గీర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈ కేసే అక్కర్లేదు. ఎస్ఐ గారు నే...