భారతదేశం, అక్టోబర్ 12 -- Illu Illalu Pillalu October 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పెద్ద కొడుకు జీవితం నాశనమైందని రామరాజు కుమిలి కుమిలి ఏడుస్తాడు. వాళ్లు తీయన మాటలతో మోసం చేశారు. పెద్ద బంగ్లా చూపించారు. అలాంటి వాళ్లు మోసం చేస్తారని ఎవరైనా అనుకుంటారా? అని భర్తను ఓదార్చేందుకు వేదవతి ప్రయత్నిస్తుంది.

భర్త రామరాజుకు ప్రేమగా అన్నం తినిపిస్తుంది వేదవతి. ఈ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మరోవైపు రాత్రి పూట భద్రావతి ఇంటి పక్కన విశ్వ, అమూల్య సీక్రెట్ గా కలుస్తారు. మీ కుటుంబం సంతోషంగా ఉందనుకునే సమయంలోనే వల్లి విషయం బయటపడింది. మళ్లీ బాధే మిగిలింది. మా పెద్దత్త అలా చేసిందని తెలిసింది. ఇంత జరుగుతుంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని అమూల్యను విశ్వ అడుగుతాడు.

నీకు ఎందుకు చెప్పాలి? మా అన్నయ్య, వదిన కలిసేంతవరకే మనం ఇద్దరం కల...