భారతదేశం, నవంబర్ 24 -- Illu Illalu Pillalu November 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న నర్మద ఆమెను ఇంటికి తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేద్దామనుకుంటుంది. కానీ దీపావళి సంబరాల్లో ఉన్న రామరాజు ఫ్యామిలీ వల్లిని చూడగానే షాక్ అవుతుంది. వేదవతి అయితే కోప్పడుతుంది.

సాయంత్రం నుంచి సర్ ప్రైజ్ సర్ ప్రైజ్ అంటున్నావ్ ఇదేనా? నర్మద అక్క తీసుకురావడం, నువ్వు ఎలివేషన్ ఇవ్వడం అని ధీరజ్ పై ప్రేమ మండిపడుతుంది. ఎలివేషన్ ఇచ్చింది వల్లి అక్కకు కాదు, వల్లి అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకు అని నర్మద చెప్పగానే మరోసారి అందరూ షాక్ అవుతారు.

మామయ్య మీరు తాతయ్య కాబోతున్నారని నర్మద చెప్పగానే రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆవిడ గారు నానమ్మ కాబోతున్నారని చెప్పండి. షాక్ లో నోరు వెళ్లబెట్టారని వేదవతి గురించి చెప్తుంది...