భారతదేశం, నవంబర్ 16 -- Illu Illalu Pillalu November 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఓపెనింగ్ సందర్భంగా చందు బావ తనను అన్న మాటలను తలుచుకుంటూ ఏడుస్తూ వల్లి నడుచుకుంటూ వెళ్తుంది. రోడ్డు పక్కన వెళ్తున్న వల్లిని అంజలి చూసి తన కారు ఆపుతుంది.

మీరు చందు వాళ్ల వైఫ్ కదా. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా రండి. ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారేంటీ. మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం కదా. డ్రాప్ చేస్తా అని వల్లిని అంజలి అడుగుతుంది. అసలు మా బావ అంజలికి ఎలా తెలుసని వల్లి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంది. దీంతో వణికిపోయిన అంజలి మాట మారుస్తుంది.

చందు, నేను ఫ్రెండ్స్ కాదు. మీ మామ రామరాజు అంటే తెలియని వాళ్లు ఎవరుంటారు. అందుకే వాళ్ల అబ్బాయిలు కూడా మాకు పరిచయం ఉంది. బతుకమ్మలో కూడా పెద్ద కోడలు అని ఎవరో మిమ్మల్ని చూపించారు....