భారతదేశం, నవంబర్ 10 -- Illu Illalu Pillalu November 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. చందు ప్రేమను గుర్తు చేసుకుంటూ అంజలి బాధపడుతుంటుంది. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నాకిచ్చిన మాట మీద నిలబడి ఉంటే నా జీవితం ఇలా అయి ఉండేది కాదు. ఎందుకు చందు మన ప్రేమను చంపేశావ్? అని అంజలి అనుకుంటుంది.

ఇటు చందు ఫుల్ గా తాగి రోడ్డు మీద తులూతూ వస్తాడు. నా జీవితం సర్వనాశనమైపోయింది. ఆ వల్లి అమాయకురాలనుకొని నెత్తిన, గుండెల్లో పెట్టుకున్నా. నా గుండెల మీద తన్ని, నా ప్రేమకు తలకొరివి పెట్టేసిందని అరుస్తూ రాయి తగిలి అంజలి ఇంటి ముందు రోడ్డు మీద చందు పడిపోతాడు.

ఆ సౌండ్ కు అంజలి బయటకు వస్తుంది. చందును చూసి షాక్ అవుతుంది. లే చందు అని అంజలి ఏడుస్తుంది. అప్పుడే కళ్లు తెరిచిన చందుకు అంజలి కనిపించడంతో మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు నిజంగా నా అంజల...