భారతదేశం, మే 8 -- Illu Illalu Pillalu May 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 8 ఎపిసోడ్ లో.. వల్లి ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్ చూసి కచ్చితంగా అబ్బాయే అని వేదవతి.. లేదు అమ్మాయే పుడుతుందని రామరాజు వాదించుకుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. డైరెక్ట్ గా వల్లి అక్కనే అడగండని నర్మద అంటుంది. అబ్బాయిని కంటావా? అమ్మాయిని కంటావా? అని వల్లిని వేదవతి అడుగుతుంది.

అసలు నాకు కడుపే లేదు అత్తయ్య అని శ్రీవల్లి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రామరాజు అయితే కంగారుగా కుర్చీలోనుంచి లేస్తాడు. కడుపులో ఏం లేకపోవడం ఏంటి వల్లి? అని వేదవతి అడుగుతుంది. నా చేతుల్లో ఏం లేదు. అంతా పైవాడి చేతుల్లో ఉంది. ఎవరినిస్తాడో అని వల్లి కవర్ చేస్తుంది.

అప్పుడే రామరాజు ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. ట్రంకు పెట్టెతో, ఒంటి నిండా నగలు, కళ్లకు అద్దాలతో ఓ అమ్మాయి దిగుతుంది. ఆమెను చూస...