భారతదేశం, జూలై 31 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో ఫుల్ గా తాగిన రామరాజు తన చిన్నకొడుకు బాధను చూసి కుమిలిపోతాడు. ప్రేమను తీసుకెళ్లడానికి ధీరజ్ వెళ్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

తిరుపతితో కలిసి మందు తాగుతూ రామరాజు ఫీల్ అవుతాడు. బుజ్జమ్మా పెద్ద నిజం దాచి నన్ను మోసం చేసిందిరా అని ఎమోషనల్ అవుతాడు. నా బుజ్జమ్మాతో పాటు అందరూ నన్ను మోసం చేశారని తెలిస్తే గుండె పగిలి చస్తానురా. ఇప్పటికే గుండె అంతా పట్టేసినట్లు ఉందిరా అని రామరాజు అంటాడు. అప్పుడే వచ్చిన ధీరజ్.. అమ్మ నిన్ను మోసం చేయలేదు నాన్న అని చెప్తాడు.

అమ్మ దగ్గర నేను మాట తీసుకున్న కాబట్టి మీకు ఆ విషయం చెప్పలేదు. అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదని తండ్రితో ధీరజ్ అంటాడు. కన్న కొడుక్కి ఇచ్చిన మాట కోసం కట్టుకున్న భర్తను మోసం చేయొచ్చా అని ...