భారతదేశం, జూలై 10 -- Illu Illalu Pillalu July 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ లో తండ్రి రామరాజుకు కూతురు అమూల్య దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. కోర్టులో విశ్వకు శిక్ష ఖాయమైన సమయంలో కేసు వాపసు తీసుకుంటుంది. మరోవైపు నర్మద, ప్రేమపై పగతో వల్లి రగిలిపోతుంటుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏమైందో చూసేయండి.

వర్షంలో బట్టలు తీస్తున్న కోడళ్లు నర్మద, ప్రేమకు అత్త వేదవతి పరుగెత్తుకుంటూ వెళ్లి గొడుగు పడుతుంది. అది చూసి వర్షంలో తడుస్తున్న శ్రీవల్లి రగిలిపోతుంది. ఇప్పుడు ప్రేమతో గొడుగు పడతారు, ఆ తర్వాత కోపం వస్తే మాత్రం గయ్యాళి గంగమ్మలా చిందులు తొక్కుతారని నర్మద అంటుంది. పాత విషయాలను మనసులో పెట్టుకుని అత్తను కోడలు సాధిస్తుంది. నేను పెద్ద గడుసును అని వేదవతి అంటుంది.

గడుసు కాదు గయ్యాళి అని నర్మద అనగానే.. ఆమె చెవిని వేదవతి మెలిపెడుతుంది. ...