భారతదేశం, ఆగస్టు 5 -- Illu Illalu Pillalu August 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ ను తిరిగి కలిపేందుకు సాయం చేయమని విశ్వ అడిగితే అమూల్య ఒప్పుకోదు. ఇక ఫుల్ గా తాగిన ధీరజ్ నానా హంగామా చేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ప్రేమ, ధీరజ్ గురించి మాట్లాడాలని అమూల్యకు విశ్వ చెప్తాడు. ధీరజ్ అంటే మా చెల్లెలికి ఎంత ప్రేమ ఉందో, తను దూరం అయినందుకు ఎంత నరకం అనుభవిస్తుందో నేను కళ్లారా చూస్తున్నా. మీ అన్నయ్య కూడా అంతే బాధపడుతుంటాడు. మనమిద్దరం కలిసి, వాళ్లను కలుపుదామని విశ్వ చెప్తాడు. ఏంట్రా, మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టావా? నన్ను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నావా? అని అమూల్య ఫైర్ అవుతుంది.

మా చెల్లెలి బాధ గురించి ఆలోచిస్తున్నా కాబట్టే అడుగుతున్నానని విశ్వ అంటాడు. ఒకప్పుడు మన ఫ్యామిలీలు కలవాలంటే మన పెళ్లితోనే సా...