భారతదేశం, ఆగస్టు 3 -- Illu Illalu Pillalu August 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజుఎపిసోడ్ లో వేదవతితో రామరాజు మాట్లాడకుండానే ఉంటాడు. ఇక ప్రేమ ఎస్ఐ కోచింగ్ కు వెళ్లేలా ధీరజ్ రెచ్చగొడతాడు. కాలేజీలో అమూల్య కోసం వచ్చిన విష్వక్ కు సాగర్ కొడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి భర్త కోసం వేదవతి చూస్తుంది. కానీ రామరాజు ఏమో రాకుండా అటూ ఇటూ తిరుగుతుంటాడు. చిన్నోడా టిఫిన్ చేద్దాం రా అని ధీరజ్ ను చందు పిలుస్తాడు. అప్పుడే వచ్చిన నర్మదను ప్రేమ గురించి అడుగుతుంది వేదవతి. మాట్లాడితే రానని తెగేసి చెప్పిందని నర్మద చెప్తుంది.

మాట్లాడితే ప్రేమకు నేను సొంత అక్కలాంటిదాన్ని. మా చెల్లెలికి నేను ఎంత చెప్తే అంతా అని తెగ బిల్డప్ ఇచ్చావ్ కదా. కానీ తీసుకు రావడం చేతకాదు. దీనికి గవర్నమెంట్ జాబ్ ఎందుకు? అని వే...