భారతదేశం, ఆగస్టు 28 -- Illu Illalu Pillalu August 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రైస్ మిల్ లో పోయిన రూ.6 లక్షల గురించి నిద్రపోకుండా చందు ఆలోచిస్తుంటాడు. ఇంకోసారి తిరుపతి మీద డౌటింగ్ వచ్చేలా చేద్దామనుకొని చందుతో శ్రీవల్లి మాట్లాడుతుంది.

రూ.6 లక్షల గురించేనా ఈ టెన్షన్. నువ్వు నన్ను భార్యగా చూడలేకపోవచ్చు. కానీ నా భర్త టెన్షన్ పడుతుంటే నేను చూడలేను. చేయని తప్పునకు మీ నాన్న ముందు దోషిలా నిలబడతావా? అయినా డబ్బులు కొట్టేసినోళ్లు బాగానే ఉన్నారు. ఏ పాపం తెలియని మా ఆయన టెన్షన్ పడుతున్నాడని శ్రీవల్లి అంటుంది.

ఎవరి గురించి మాట్లాడుతున్నావని చందు అడుగుతాడు. మీ తిరుపతి మామయ్య గురించే అని బల్లక్కాయ్ చెప్పేసరికి చందుకు కోపమొస్తుంది. ఇంకోసారి మా మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగలగొడతానని చందు వార్నింగ్ ఇస్తాడు. అయిన...