భారతదేశం, ఏప్రిల్ 13 -- Illu Illalu Pillalu April 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ యాక్సిడెంట్ తో ఓ మలుపు తీసుకుంది. అయితే ఈ యాక్సిడెంట్ పై ప్రేమ అనుమానం వ్యక్తం చేయడంతో సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ధీరజ్ ను ప్రేమగా బావ అని ప్రేమ పిలుస్తుంది. ప్రేమకు ధీరజ్ తినిపిస్తుంటాడు. ప్రేమకు పొలమారితే నీళ్లు తాగిపిస్తాడు. ఇద్దరూ రొమాంటిక్ గా ఓ సాంగ్ వేసుకుంటారు. అప్పుడే శారదాంబ, రేవతి వస్తారు. ఎలా ఉన్నావమ్మా అని ప్రేమను రేవతి అడిగితే, నా లాంటి భర్త ఉన్నాక ఇంకెలా ఉంటుంది? అంటూ ధీరజ్ గొప్పలకు పోతాడు.

భద్రావతి చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు వచ్చావేంటి అమ్మమ్మ అని శారదాంబను ధీరజ్ అడుగుతాడు. భద్రావతి అందరికి పెద్ద పులి ఏమో కానీ నా దగ్గర మాత్రం పిల్లిరా పిల్లి. నన్న...