భారతదేశం, అక్టోబర్ 4 -- Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రేటింగ్ లో అదుర్స్ అనిపిస్తోంది. ఈ టాప్ సీరియల్ కు తెలుగు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎమోషనల్ తో పాటు ట్విస్టులతోనూ ఎంటర్ టైన్ చేస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్లు, రామరాజు కోడల్లయిన నర్మద, ప్రేమ మళ్లి ఒక్క చోటుకు చేరారు. రామరాజు కోడల్లుగా ఆ ఇంటిని నర్మద, ప్రేమ కాపాడుతూ వచ్చారు. కానీ బల్లక్కాయ్, భద్రావతి కుట్ర కారణంగా ధీరజ్, ప్రేమ విడిపోయారు. ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నర్మద అసలు నిజాలు బయటపెట్టడంతో ధీరజ్ ను పెళ్లి చేసుకున్న ప్రేమ తిరిగి అత్తారింటికి వచ్చింది.

రామరాజు ఇంట్లో ప్రాబ్లెమ్స్ అన్నింటికీ బల్లక్కాయ్ కారణమని నర్మద తెలుసుకుంది. అందుకే పెద్ద కోడలు ...