భారతదేశం, జూలై 26 -- Illu Illalu Pillalu: బుల్లితెరపై 'స్టార్ మా' (Star Maa) ఛానెల్‌లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్స్‌లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్ లోని పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ముఖ్యంగా 'ప్రేమ' పాత్రలో నటించిన కన్నడ నటి లావణ్య భరద్వాజ్ తన అమాయకత్వం, ముద్దు ముద్దు నటనతో దాదాపు 500కు పైగా ఎపిసోడ్లలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

అయితే, నిజ జీవితంలో గర్భవతి కావడంతో కొన్ని నెలల క్రితమే లావణ్య భరద్వాజ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకొంది. ఆ స్థానంలో ప్రేమ క్యారెక్టర్లో మరో నటి మన్విత జగదీష్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ పాత ప్రేమను సీరియల్ ప్రేమికులు మిస్ అవుతూనే ఉన్నారు. లేటెస్ట్ పాత ప్రేమ ఇల్లు ఇల్లాలు పిల్లలు సెట్ కు రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల లావణ్య భరద్వాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో "...