భారతదేశం, జూలై 24 -- Illu Illalu Pillalu: తెలుగు బుల్లితెర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో డ్రామా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. రామరాజు, వేదవతిల చుట్టూ తిరిగే ఈ కుటుంబ కథలో ఇప్పటివరకూ ఉన్న గొడవలు ఒకెత్తయితే, ఇప్పుడు మొదలైన 'లోపలి శత్రువు - బయటి శత్రువు' కాంబినేషన్ కుట్ర మరొక ఎత్తు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కథ ప్రకారం శారదాంబ పుట్టినరోజు వేడుకల నెపంతో భద్రావతి ఊహించని డ్రామా స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లూ వేదవతి రూపాన్ని చూస్తేనే మండిపడే భద్రావతి, ఉన్నట్లుండి ఆమెతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమోషనల్ కావడం, చివరికి చెల్లెలితో కలిసి సంతోషంగా డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

వేదవతి ఈ మార్పును నిజమైన అక్క ఆప్యాయతగా నమ్మి సంబరపడుతుండగా, ఇంట్లో ఉన్న ధీరజ్, నర్మదలకు మాత్రం భద్రావతి ప్రవర్...