భారతదేశం, ఆగస్టు 9 -- Illu Illalu Pillalu: ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫన్ కూడా కలిపి తెలుగు సీరియల్ ఆడియన్స్ ను 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఎంటర్ టైన్ చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. తాజాగా సీరియల్ లో స్టోరీ మరింత రసవత్తరంగా మారింది. ప్రేమకు నిజం తెలిసేలా చేసేందుకు నర్మద వేసిన ప్లాన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు చిన్న కోడలు ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ధీరజ్ ను అపార్థం చేసుకుంది. కళ్యాణ్ గతాన్ని చెప్పినందుకు తన భర్తను చెంపపై కొట్టి మరీ ప్రేమ వెళ్లిపోయింది. అయితే ఇదంతా భద్రావతితో కలిసి శ్రీవల్లి చేసిన కుట్రనే. ఇప్పుడీ నిజాన్ని ప్రేమకు చెప్పేలా నర్మద ప్లాన్ వేస్తోంది.

అమ్మవారికి పట్టుచీర పెట్టడానికి రామరాజు కుటుంబం గుడికి వెళ్లేందుకు రెడీ అవుతుంది....