భారతదేశం, ఆగస్టు 17 -- Illu Illalu Pillalu chandu: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ తెలుగు సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) ఫేమ్ ప్రశాంత్ కడియం (Prashanth Kadiyam) ఓ ఇంటి వాడు కానున్నాడు. అతని ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ సీరియల్ లో 'చందు' (పెద్దోడు) పాత్రలో నటిస్తూ తనదైన అభినయంతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న ప్రశాంత్, త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఈ సంతోషకరమైన క్షణాల్లో సీరియల్‌లో ప్రశాంత్‌కు సోదరుడిగా నటించే సహ నటుడు రఫీక్ (Rafiq) ప్రత్యక్షంగా హాజరై సందడి చేశాడు. వేడుక అనంతరం ప్రశాంత్, ఆయన కాబోయే భార్యతో దిగిన ఫోటోలను రఫీక్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.

కాబోయే దంపతులక...